27 August 2023
కడుపుతో ఉన్నవాళ్లు జంక్ ఫుడ్ తింటున్నారా.? అయితే ఇది తెలుసుకోండి.
సాధారణ పరిస్థితులతో పోలిస్తే గర్భిణీగా ఉన్న సమయంలో మహిళలు ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సింది.
ఇక తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. మరి ముఖ్యంగా జంక్ ఫుడ్ విషయంలో..
ఇది ఎంత మాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు జంక్ ఫుడ్ తీసుకుంటే ఏం నష్టం జరుగుతుందో తెలుసుకుందాం.
సాధారణంగా జంక్ ఫుడ్ తయారీలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సర్జరీ సమయంలో ఇది ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
ఇక కొన్ని రకాల జంక్ ఫుడ్స్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో షుగర్ వ్యాధితో బాధపడేవారిలోఅకాల ప్రసవానికి దారితీసే ప్రమాదం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు.
జంక్ ఫుడ్‌లో ప్రత్యేకంగా ఎలాంటి పోషకాలు ఉండకపోగా ఇవి చిన్నారుల ఎదుగుదలపై దుష్ఫ్రభావం చూపుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి