వంద చికెన్‌ వంటకాల్లో ప్రథమ స్థానం బటర్ చికెన్.!

05 December 2023

వంద చికెన్‌ వంటకాల్లో ప్రథమ స్థానం దేనిదో వెల్లడించిన టేస్ట్‌ అట్లాస్‌.

చికెన్‌ అనగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. 

చికెన్‌తో వందలాది రకాల్లో వెరైటీ డిషెస్‌ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 

అయితే వీటిలో కొన్నింటినే చాలా మంది రుచి చూసి ఉంటారు.

చాలా రకాలు ఎక్కువగా రెస్టారెంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

అయితే చికెన్‌లలో బటర్‌ చికెన్‌ రుచే వేరంటూ ఆహార ప్రియులెవరైనా ఒప్పుకుంటారు. ఇదే విషయాన్ని టేస్ట్‌ అట్లాస్‌ కూడా ప్రకటించింది. 

దేశంలోని వంద రకాల చికెన్‌ వంటకాల్లో బటర్‌ చికెన్‌కే ఎక్కువ మంది ఓటేయడంతో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

సంప్రదాయ వంటకాలకు ఆన్‌లైన్‌ గైడ్‌గా ఉన్న టేస్ట్‌ అట్లాస్‌ ఈ విషయాన్ని తాజాగా  వెల్లడించింది.