కీటో డైట్‌తో దుష్ప్రభావాల లిస్ట్ చాంతాడంత

31 August 2023

బరువు తగ్గడానికి  కీటో డైట్‌ ఫాలో కావడం ఫ్యాషనైంది. అయితే ఇందులో కొవ్వు, ప్రొటీన్‌, పిండి, పీచు పదార్థాల బ్యాలెన్స్ మిస్‌ అవుతుందన్నది పోషకాహార నిపుణుల మాట. 

బరువు తగ్గడానికి , కీటో డైట్‌లో  కొవ్వు, ప్రోటీన్ అధికంగా, చాలా తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 

రోజూవారీ పనులకు అవసరమైన శక్తిని  మన శరీరం కార్బొహైడ్రేట్ల నుంచి తీసుకుంటుంది. అదే కీటో డైట్‌లో శరీరం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. 

కార్బొహైడ్రేట్లు మన శరీరానికి ఎనర్జీ బ్యాంక్‌గా పనిచేస్తాయి. వీటిని తక్కువ స్థాయిలో అందించడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 

కీటో డైట్‌లో కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.  మాంసం, చేపలు, డైరీ తీసుకోవాలన్న భ్రమలో  అన్నం,  బంగాళాదుంప, పండ్లు వంటి పీచు పదార్థాలున్న ఆహారాన్ని తక్కువగా తింటారు. 

మెదడు, గుండె, కాలేయానికి  సూక్ష్మ పోషకాలు,  విటమిన్లు తప్పకుండా అందచేయాలి.  చర్మం, జుట్టు పోషణకు ఇవి అవసరం.  అదే కీటో డైట్‌లో ఈ పోషకాల కొరత ఏర్పడుతుంది. 

పోషకాల లోపం మొదట చర్మం, గోర్లు, జుట్టుపైన కనిపిస్తుంది. బరువు తగ్గేందుకు కీటో డైట్‌ను ఫాలో అవడానికి ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

దీర్ఘకాలంపాటు ఈ డైట్‌ను ఫాలో అవడానికి ముందు దాని దుష్ప్రభావాలపై కూడా దృష్టి పెట్టాలి. ఈ డైట్‌ను న్యూట్రిషనిస్ల్‌ పర్యవేక్షణలో మాత్రమే అమలు చేయడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.