తంగేడు చెట్టు లోని ఔషధాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!
Jyothi Gadda
19 March 2024
తంగేడు పూలు షుగర్ వ్యాధికి దివ్య ఔషధంగా పని చేస్తాయి. గుప్పెడు తంగేడు పువ్వులను తీసుకుని మినప పప్పుతో లేదా పెసర పప్పుతో కూర చేసుకుని తింటే షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
తంగేడు పూల రెక్కలు, చక్కెర ఆవు పాలలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ చొప్పున రోజూ తీసుకోవడం వల్ల మగవారు ఎదుర్కునే నిద్రలో కలిగే స్కలన సమస్య తగ్గుతుంది.
శరీరానికి బలాన్ని చేకూర్చడంలోనూ తంగేడు పువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. అరికాళ్లలో మంటలను, నీరసాన్ని, గుండె దడను తగ్గించడంలోనూ తంగేడు చెట్టు పూలు దోహదపడతాయి.
తంగేడు పూల రెక్కలు 100 గ్రా, ధనియాల పొడి 50 గ్రా, యాలకుల పొడి 20గ్రా, శొంఠి పొడి 20 గ్రాముల చొప్పున కలిపి నిల్వ చేసుకోవాలి. రాగి పిండిజావలో పాలు, పంచదారతో పాటు ఈ మిశ్రమాన్ని టీ స్పూన్ కలిపి తాగాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమం క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందుతారు. అరికాళ్లలో మంటలు, గుండె దడ, నీరసం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
చారు, రసం, సాంబార్ వంటి వాటిని తయారు చేసేటప్పుడు తంగేడు పూల రెక్కలు, లేదంటే, పొడిని వేసి మరిగించి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది. అతి మూత్ర వ్యాధిని నివారిస్తుంది.
తంగేడు పువ్వుల రెక్కలను నీడలో ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడికి చక్కెరను లేదా తేనెను కలిపి ప్రతిరోజూ అర టీ స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల అతి మూత్ర వ్యాధి నయం అవుతుంది.