ఒంటె పాలతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
TV9 Telugu
18 January 2024
తరచూ అలెర్జీలు, అనారోగ్య సమస్యల బారిన పడేవారు ఒంటె పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో విటమిన్ సి అధికంగా ఉంటుందని పరిశోధనలో తేలింది.
ఈ ఒంటె పాలను టైప్-డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. జీర్ణవ్యవస్థ సమస్యతో బాధపడుతున్నవారికి ఒంటె పాలతో ఎంతో మేలు జరుగుతుంది.
ఒంటె పాలు బ్యాక్టీరియా, క్రిముల యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఒంటె పాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో బయోయాక్టివ్ పెప్టైడ్‌ల గొప్ప మూలంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒంటె పాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నిరోధక లక్షణాలను తొలగించవచ్చు. ఒంటె పాలలో అధిక శాతం విటమిన్లు, ప్రోటీన్లు, మంచి కొవ్వులు ఇలా అనేక పోషకాలు లభిస్తాయి.
లివర్, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు వీరు ప్రతిరోజు ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు.
ఒంటె పాలు తీసుకోవడం వల్ల అధిక శాతం ప్రొటీన్ ను సొంతం చేసుకోవచ్చు. ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు నుంచి కూడా ఎంతో రక్షిస్తుంది.
ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఈ ఒంటె పాలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
మీరు కూడా ఆవు పాలు బదులుగా ఈ ఒంటె పాలు లభిస్తే వీటిని తప్పకుండా మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.