సాధారణంగా ఎక్కిళ్లు అనేవి అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. ఎక్కిళ్లు వస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పడుకోవాలన్నా.. కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.
గొంతులో నొప్పి కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆగకపోతే ఏం జరుగుతుందోనని భయంగా కూడా అనిపిస్తుంది. ఎక్కిళ్లు ఎప్పుడైనా రావచ్చు.
ఎక్కిళ్లు తగ్గడానికి చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. పగలు అయితే పర్వాలేదు. కానీ రాత్రి పూట వచ్చాయంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు నీటిని గొంతు దగ్గర కొన్ని సెకన్ల పాటు ఆపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.
కూలింగ్ వాటర్ తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు అనేవి తగ్గుతాయి. ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఆహార పదార్థాలు ఏమన్నా తింటూ ఉండాలి. చక్కెర నోట్లో వేసుకుని నెమ్మదిగా నమలడం చేయాలి.
బియ్యం తినడం వల్ల కూడా ఎక్కిళ్లు అనేవి తగ్గుతాయి. అలాగే చల్లటి నీటితో ముఖం కడిగినా, కొన్ని సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచడం వల్ల కూడా ఎక్కిళ్లు కంట్రోల్ అవుతాయి.
ఐస్ క్యూబ్‌ని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరించడం వల్ల కూడా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక వెల్లుల్లి రెబ్బను తిన్నా, ఒక స్పూన్ నిమ్మ రసం తాగినా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.