ఈ ఆకు షుగర్‌ను తరిమేస్తుంది.. పేగుల్లో చెత్తను ఊడ్చేస్తుంది..!
Jyothi Gadda
06 May 2024
స్టీవియా ఆకులు.. దీనినే మధుపత్రి అని కూడా పిలుస్తారు. చక్కెర కంటే ఎక్కువ తియ్యగా ఉండే మధుపత్రి ఆకుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు నిండి ఉంటాయి. అందుకే ఆరోగ్య పరంగా మధుపత్రి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ ఆకులు పంచదార కంటే 150 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. కానీ పంచదార కంటే ఈ ఆకులు ఎంతో మేలైనవి. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదు. నోటిలో వేసుకుని బాగా నమిలి తినాలి. లేదా షుగర్‌కు బదులుగా మధుపత్రి ఆకుల రసాన్ని వాడొచ్చు.
100 గ్రాముల స్టీవియా ఆకుల పొడిలో 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికి ప్రోటీన్, క్యాలరీలు, ఫైబర్, ఫ్యాట్ వంటి పోషకాలు ఏ మాత్రం ఉండదు. ఈ ఆకుల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికి అవి గ్లూకోసైడ్ రూపంలో ఉంటాయి. కనుక వీటిని మన ప్రేగులు జీర్ణం చేయలేవు.
ఒకవేళ జీర్ణం అయినప్పటికి ఇవి మూత్రం ద్వారా బయటకు వస్తాయి. కనుక మనకు శక్తి లభించదని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. వేడి పదార్థాల్లో కూడా ఈ ఆకుల పొడిని మనం వేసుకోవచ్చు.
షుగర్ వ్యాధితో బాధపడే వారు పంచదార, బెల్లం వంటి వాటిని తీసుకోరు కనుక అటువంటి వారు ఈ స్టీవియా పౌడర్ ను టీ, కాపీ, లస్సీ, జ్యూస్ వంటి వాటిలో వేసుకోవచ్చు. క్యాలరీలు పెరగకుండా జ్యూస్ లను తాగాలనుకునే వారు కూడా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు.
అలాగే దగ్గు, ఆస్థమా, పిల్లి కూతలు, శ్లేష్మాలు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా పంచదారను ఎక్కువగా తీసుకోరు. అలాంటి వారు కూడా ఈ స్టీవియా పౌడర్ ను ఉపయోగించుకోవచ్చు.
ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. అదే విధంగా ఈ స్టీవియా పౌడర్ మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ స్టీవియా పొడిని వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ పొడిని వాడడం వల్ల రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్ ల బారిన కూడా పడకుండా ఉంటాము. రోజూ 20 గ్రాముల స్టీవియా పొడిని వాడడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.