నిమ్మరసం అతిగా తీసుకుంటే..? 

05 October 2023

నిమ్మకాయలో ఆమ్లత్వంతో ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. 

నిమ్మరసం, తేనె తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుందని తెలిసిందే. అయితే అతిగా తీసుకుంటే మాత్రం పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. 

నిమ్మకాయ రసాన్ని మోతాదుకు మించి తీసుకుంటే తరుచూ యూరిన్‌కి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఇది డీ హైడ్రేషన్‌ సమస్యకు దారి తీస్తుంది. 

నిమ్మరసాన్ని అతిగా తీసుకోవడం వల్ల చర్మం పొడి బారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అలర్జీలతో బాధపడేవారు ఎక్కువగా తీసుకోకూడదు.

నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే మెగ్రేన్‌, తలనొప్పి సమస్యలు వచ్చే అవాకశం ఉంటాయి. టైరమైన్ కారణంగా తలనొప్పి వస్తుంది. 

నిమ్మరసాన్ని మోతాదుకు మించి తీసుకుంటే నోటి పూత, నోట్లో పుండ్లు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

గ్యాస్‌ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా నిమ్మరసాన్ని తీసుకోకూడదు. దీంతో పొట్టలో వికారం, వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. 

జుట్టు ఆరోగ్యంపై కూడా నిమ్మరసం ప్రభావం చూపుతుంది. మోతాదుకు మించి నిమ్మరసం తీసుకుంటే జుట్టు డ్రైగా మారే అవకాశం ఉంటుంది.