జీడిపప్పు అధికంగా తింటే ఏమవుతుంది.?
13 October 2023
జీడిపప్పు ఆరోగ్యానకి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో శరీరానికి మేలు చేస్తుంది.
ఇక ఇందులోని అసంతృప్త కొవ్వులు, విటమిన్-ఇ, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫాస్పరస్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో జీడిపప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే బీపీని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
జీడిపప్పులోని అసంతృప్త కొవ్వులు మెదడును చురుగ్గా మారుస్తాయి. పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక జీడిప్పు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులు రోజుకు మూడు నుంచి నాలుగు ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు.
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ ఎక్కువ తీసుకుంటే మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనపు కేలరీలు పెరిగే అవకాశం ఉంటుంది.
జీడిపప్పు అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో వేయించుకొని తింటే ఈ అవకాశం మరింత ఎక్కువంటున్నారు.
ఇక జీడిపప్పు అధికంగా తీసుకుంటే కొందరిలో కడుపుబ్బరం తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..