టమాటో ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా.?
14 January 2024
TV9 Telugu
టమాటాలోని నసల్మోనిలా అనే రసాయనం వల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎదురవొచ్చు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువని చెబుతున్నారు.
టమాటను అధికంగా తీసుకుంటే ఎసిడిటీ సమస్య పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తేన్పులు, ఛాతీలో నొప్పి సమస్యలు వస్తాయని అంటున్నారు.
ఇక టమాటోను అధికంగా తీసుకోవడం వల్ల టమాటలో అధికంగా ఉండే పొటాషియం, ఆక్సలేట్ పదార్థాలు కిడ్నీలో రాళ్లను పెంచవచ్చు.
టమాటాలో అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సూప్‌గా తీసుకుంటే ఈ సమస్య ఎక్కువి చెబుతున్నారు.
టమాటాలో హిస్టమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపించి, ఆర్థరైటిస్ లాంటి సమస్యల్ని తీవ్రతరం చేస్తుంది.
మైగ్రెయిన్ సమస్యతో బాధపడే వారు టమాటాకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోకి కొన్ని గుణాలు మైగ్రేన్ నొప్పికి దదారి తీస్తాయని చెబుతున్నారు.
అలర్జీతో బాధపడే వారు కూడా టమోటాకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. టమోటాలో ఉండే హిస్టమిన్ సమ్మేళనం అలర్జీని కలిగిస్తుందని అంటున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..