జీడిపప్పు మంచిదే, కానీ... 

17 September 2023

జీడిపప్పును అధికంగా తీసుకుంటే పొట్టలో సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, విరేచనాలు, గ్యాస్‌ వంటి సమస్యలు వస్తాయంటున్నారు. 

పొట్టలో సమస్యలు.. 

జీడిపప్పులో అధికంగా క్యాలరీలు ఉంటాయి. ప్రతిరోజూ జీడిపప్పును తీసుకుంటే స్థూలకాయం సమస్య రాక తప్పదని నిపుణులు చెబుతున్నారు. 

ఊబకాయం వేధిస్తుంది.. 

కొన్ని సందర్భాల్లో జీడిపప్పు అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలర్జీలు ఉన్నవారు జీడిపప్పును తక్కువగా తీసుకోవాలి

అలర్జీ సమస్యలు.. 

జీడిపప్పులో అమినో యాసిడ్‌లు టైరమైన్‌లు అధికంగా ఉంటాయి. అవి తలనొప్పికి కారణంగా మారుతాయి. తలనొప్పి, మైగ్రేన్‌లు ఉన్న వారు జీడిపప్పుకు దూరంగా ఉంటే మంచిది. 

తలనొప్పి.. 

జీడిపప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటిని పీల్చుకుంటుంది. దీనివల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

మల బద్ధకం.. 

జీడిపప్పులో మెగ్నీషియం, కాల్సియం అధికంగా ఉంటాయి. వీటివల్ల మూత్ర పిండాల్లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

మూత్ర పిండాల సమస్యలు.. 

జీడిపప్పులో ఐరన్‌ అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో కణాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది ఊపిరితిత్తుల కణాలలో పేరుకుపోయినట్లే ఆస్తామా వంటి సమస్యలు వస్తాయి. 

ఊపిరితిత్తుల సమస్య.. 

బపైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా వైద్యుల సూచన పాటించడం ఉత్తమం.