ఈ వ్యాధులు ఉన్నవారు జామ పండును ఎక్కువగా తినకూడదు?

TV9 Telugu

06 January 2024

జలుబు, దగ్గు ఉన్నవారు జామపండు తినకూడదు. ఎందుకంటే ఇది వ్యాధి లక్షణాలను పెంచుతుంది. దీనిని ముఖ్యంగా రాత్రిపూట అస్సలు తినకూడదు. 

జామపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు జామపండు తినకూడదు. 

గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే స్త్రీలు guava తీసుకునే ముందు తప్పక డాక్టరును సంప్రదించాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది.

జామ పండు రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు జామపండును జాగ్రత్తగా తీసుకోవాలి.. ఎక్కువగా తినకూడదు. ఒకవేళ సర్జరీ చేయించుకోవాల్సి వస్తే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే జామపండు తినాలి. 

ఇది రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల రక్తస్రావం ఎక్కువ అవుతుంది. జామ ఆకులను తీసుకోవడం వల్ల రక్తహీనత, తలనొప్పి, కిడ్నీ సమస్యలు వస్తాయి. జామపండును ఎక్కువగా తీసుకోవద్దు.

జామ పండు అధికంగా తీసుకోవడం వల్ల ఇది మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే సహజ చక్కెర కడుపు ఉబ్బరం సమస్యను కూడా కలిగిస్తుంది. 

జామకాయలో ఫ్రక్టోజ్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అతిగా తినడం వల్ల శరీరంలో విటమిన్ సి ఎక్కువై వాపు సమస్యలు ఉన్నవారు జామకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిని తింటే వాపు పెరుగుతుంది. 

రోజూ ఒకటి లేదా రెండు జామపండు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లంచ్ లేదా డిన్నర్ కు కొంచెం ముందు దీనిని తినడం మంచిది. అంతేకాకుండా వ్యాయామానికి ముందు కూడా దీనిని తినవచ్చు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.