డయాబెటిస్ రోగులకు ఇది అమృతం లాంటిది..

07 January 2025

Ravi Kiran

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో అయితే డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. 

వయస్సు మీద పడుతున్నవారికే కాదు.. యవ్వనంలో ఉన్నవారికి కూడా ఈ వ్యాధి వ్యపరిస్తోంది. మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరిక శ్రమ తగ్గడం వల్ల ఈ వ్యాధి బారినపడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు.

 అటు శరీరానికి కావల్సినంత పోషకాలు లభించకపోయినా.. ప్రీ-డయాబెటిక్ స్టేజి‌కి వస్తున్నారు కొందరు. ఇక డయాబెటిక్ రోగులకు బీరకాయ అమృతం లాంటిదని వైద్యులు అంటున్నారు.  

బీరకాయలో కావలసినన్ని పోషకాలతో పాటు ఫైబెర్, విటమిన్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గలనుకునేవారికి బీరకాయ మంచి ఆహరంగా పని చేస్తుంది. 

దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువ ఉంటాయి. దానితో ఎక్కువసేపు అకలి వేయదు. అలాగే మీ కొవ్వును కూడా బీరకాయ్ ఇట్టే కరిగిస్తుంది. 

అటు డయాబెటిస్ రోగులకు ఈ బీరకాయ్ ఎంతగానో మేలు చేస్తుంది. ఇది తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి క్రమపద్దతిలో ఉంది. అలాగే బ్లడ్ షుగర్ స్థాయిలు కూడా పెరగకుండా నియంత్రిస్తుంది ఈ బీరకాయ. 

శరీరానికి అవసరమయ్యే రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాదు.. రక్తహీనతను సైతం నివారిస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో బీరకాయ్ దోహదపడుతుంది.