గర్భిణీలు దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా..

17 August 2023

గర్భిణీలు దానిమ్మను క్రమంతప్పకుండా తీసుకుంటే గర్భంలో శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇందులోని పొటాషియం గర్భిణీల్లో రక్తపోటును కంట్రోల్‌ చేస్తుందని, అలాగే ఇందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

మహిళలు గర్భం దాల్చిన సమయంలో రక్త హీనత సమస్య వెంటాడుతుంది. ఇలాంటి వాళ్లు దానిమ్మను డైట్‌లో భాగం చేసుకుంటే రక్త హీనత సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

గర్భిణీలు క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. ఈ పండుతో ఎముకల క్షీణత తగ్గుతుంది. తల్లిబిడ్డ ఎముకలు దృఢంగా మారుతాయి. 

కొందరు గర్భిణీలు ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమస్యకు దానిమ్మతో చెక్‌ పెట్టొచ్చు. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్‌ ఇందుకు ఉపయోగపడతాయి. 

దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫెక్షన్లను సైతం దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గర్భస్థ సమయంలో మహిళలు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య కడుపులో మంట. అసిడిటీ కారణంగా గర్భిణీలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే దానిమ్మ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. 

 గర్భస్థ సమయంలో మహిళల్లో షుగర్‌ లెవల్స్‌ కూడా పెరుగుతాయి. అయితే దానిమ్మతో దీనికి చెక్‌ పెట్టొచ్చు. దానిమ్మ వల్ల శరీరంలో షుగర్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి.