22 September 2023

వెజ్ లో కూడా ప్యూర్ మరియు టేస్టీ సలాడ్స్ తినాలనుకుంటున్నారా..?

టేస్టీ వెజ్ స‌లాడ్స్‌ను  స్నాక్‌ టైమ్‌లో లైట్‌గా తీసుకుంటే మ‌ధుమేహులు ఎన్నో ప్రయోజనాల పొందవచ్చు

రోజూ తీసుకునే ఆహారం బ‌దులు క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటూ, రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే స‌లాడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

మ‌ధుమేహులకు నోరూరించే రుచి అందించే స‌లాడ్స్‌ను ఈజీగా త‌యారుచేసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైన పోష‌కాలు అందుకోవచ్చు. 

మ‌ధుమేహం కూడా అదుపులో ఉంటూ ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి సలాడ్స్‌. మూంగ్ దాల్ స‌లాడ్ ముందు వ‌ర‌స‌లో నిలుస్తుంది.

నానబెట్టిన పెసరపప్పులో, క్యార‌ట్‌, కొత్త‌మీర‌, కొబ్బ‌రి తురుము క‌లిపి తీసుకుంటే ప‌ర్ఫెక్ట్ కాంబినేష‌న్‌గా మారుతుంది. 

రాజ్మా, శ‌న‌గ‌ల స‌లాడ్ అద్భుత‌మైన టేస్ట్‌తో పాటు ప్రొటీన్‌, ఫైబ‌ర్ పుష్క‌లంగా అందిస్తుంది. రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌వ‌చ్చు. 

దేశీ స‌లాడ్స్‌లో చాలా టేస్టీ నోరూరించేది ఉడికించిన వేరుశెనగల స‌లాడ్. ఇది  స‌రిప‌డా  ఎన‌ర్జీ అందిస్తుంది. పిల్లలూ ఇష్టంగా తింటారు.

మేతి దానా స‌లాడ్ లో నానబెట్టిన మెంతులు లేదా మొలకెత్తినవి వేసుకుంటే చేదు లేకుండా ఉంటుంది.