05 December 2023

చ‌లికాలంలో రోగ‌నిరోధ‌క శక్తిగా ప‌ల్లీ ప‌ట్టీ.! ఎలాగంటే..

చ‌లికాలంలో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ బ‌ల‌హీన‌ప‌డుతుంది. దీంతో జ‌లుబు, జ్వ‌రం, వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్లు దాడి చేస్తాయి 

సీజ‌న్ మారిన‌ప్పుడు త‌లెత్తే స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్య‌క‌ర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి

నువ్వుల ల‌డ్డు, రాగి రొట్టె, జొన్న రోటీల వంటివి కూడా ఇమ్యూనిటీని బ‌లోపేతం చేస్తాయి. 

ఇక ప‌ల్లీలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే చిక్కీ కూడా చ‌లికాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది .

బెల్లంతో చేసే ప‌ల్లీ ప‌ట్టీలో విట‌మిన్లు, మిన‌రల్స్‌తో పాటు ఫైబ‌ర్‌, ఆరోగ్య‌క‌ర కొవ్వులు, ఐర‌న్‌, ఫాస్ప‌ర‌స్‌, జింక్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. 

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌తో ఇమ్యూనిటీ బ‌లోపేత‌మ‌వుతుంది. 

ప‌ల్లీ ప‌ట్టీలో ఉండే బెల్లం శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఐర‌న్‌ను అందిస్తుంది.