ఎక్కువగా పుట్టగొడుగులు తింటే ఆరోగ్యంలో ఏ మార్పులు కనిపిస్తాయంటే! 

09 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

పుట్టగొడుగులు రుచి, ఆరోగ్యాన్ని కలిగి ఉంటాయి. పుట్టగొడుగులతో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. 

పుట్టగొడుగులు ఆరోగ్యకరం

పుట్టగొడుగులలో ప్రోటీన్, విటమిన్ సి, బి, డి, కాపర్, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం, ఫైటోకెమికల్స్ , యాంటీ-ఆక్సిడెంట్లు వంటి పోషకాలు లభిస్తాయి.

పోషకాల మెండు 

ఎవరైనా నిరంతరం పుట్టగొడుగులను తింటే.. ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసా.. 

మార్పులు కనిపిస్తాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పుట్టగొడుగులు మంచివిగా భావిస్తారు. కార్బోహైడ్రేట్స్‌తో పాటు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే గుణాలు ఇందులో ఉన్నాయి.

మధుమేహం

యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుట్టగొడుగులలో ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

రోగనిరోధక శక్తి

పుట్టగొడుగులలో యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

చర్మం కోసం

పుట్టగొడుగు తక్కువ కేలరీల ఆహారం. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు.

కొవ్వు శాతం తక్కువ