బీపీ వెంటనే అదులోకి రావాలంటే.. 

28 January 2024

TV9 Telugu

ఉన్నట్లుండి బీపీ పెరగడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా గుండెపోటు, బ్రెయిన్‌ వంటి వాటికి ఇదే ప్రధాన కారణం.

అందుకే బీపీ పెరిగిన వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడి సంప్రదించాలి. బీపీ బాగా పెరిగితే గుండెల నిండా గాలి తీసుకోవాలి. 

ఇలా రెండు, మూడు సార్లు చేస్తే వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి. 

తరచూ బీపీ పెరుగుతున్నట్లు కనిపిస్తే.. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు వెంటనే మానేయాలి. ఒత్తిడి తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలి. అతిగా ఆలోచించడం మానేయాలి. 

ఆల్కహాల్‌, కెఫిన్‌ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్న వారు వెంటనే వీలైనంత వరకు తగ్గించాలి. లేదంటే మానేయడం ఇంకా మంచిది.

బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే పాలకూర, బీన్స్‌, క్యాబేజీ వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరలు బీపీని తగ్గిస్తాయి. 

బీపీని కంట్రోల్ చేయడంలో టమాటో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్ని ఒక టమాటను తీసుకునే బీపీ అదుపులో ఉంటుంది. ఇందులోని లైకోపీన్‌ రక్తపోటు తగ్గిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఐద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.