ఈ నల్ల తుమ్మతో ఎన్ని లాభాలో తెలుసా.?

Jyothi Gadda

12  March 2024

ఎన్నో ఔషధ గుణాలను కలిగిన మొక్కల్లో తుమ్మ చెట్టు ఒక్కటి. పొలాలు, రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. నల్లటి బెరడు, పసుపు రంగు పూలు, పొడవాటి కాయలు, చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఈ తుమ్మలో అనేక రకాలు ఉన్నాయి. 

నల్ల తుమ్మచెట్టును పంట పొలాలకు కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కలపతో బొమ్మలు, పడవలు, వివిధ రకాల ఫర్నీచర్ చేసేందుకు ఉపయోగిస్తారు. తుమ్మ చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. 

తుమ్మ బెరడుతోపాటు దాని జిగురును, కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. దీని ద్వారా వెన్ను నొప్పి తగ్గుతుంది. 

అంతేకాదు.. నల్ల తుమ్మ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. లేత నల్ల తుమ్మ ఆకులను సేకరించి జ్యూస్ గా చేసుకుని తాగితే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

నల్ల తుమ్మకాయలను ఎండబెట్టి పొడిగా చేయాలి. దీనిలో తగినన్ని నీళ్లు అలాగే కండె చక్కెరను కలిపి పేస్ట్ చేయాలి. ఇది తీసుకోవడం వలన పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. 

లేత తుమ్మకాయలను తినడం కారణంగా.., పురుషుల్లో వచ్చే స్వప్న స్కలనం, శ్రీఘ్ర స్కలనం వంటి సమస్యలు తగ్గుతాయి. లేత న‌ల్ల తుమ్మ ఆకుల‌ను సేక‌రించి జ్యూస్ గా చేసుకుని తాగ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు త‌గ్గుతాయి.

నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేస్తే.. నోటిపూత, నోటిలో ఇతర సమస్యలు తగ్గుతాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోటిపూత‌, నోటిలో అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. 

తుమ్మ చెట్టు బెర‌డు 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి2 గ్రాముల కాయ చూర్ణం పొడిని క‌లిపి.. ఈ పొడిని వెన్న పూస‌తో క‌లిపి తీసుకుంటే మంచిది. తుమ్మ ఆకుల‌ను వాము , జీల‌క‌ర్ర క‌లిపి క‌షాయంలా చేసుకుని తాగితే డ‌యేరియా స‌మ‌స్య త‌గ్గుతుంది.