16 September 2023

సరైన పోషకాహారానికి ‘మై ప్లేట్‌ ఫర్‌ ద డే’

సరైన పోషకాహారానికి ‘మై ప్లేట్‌ ఫర్‌ ద డే’ సరైనది నిపుణులు సైతం చెప్తున్నారు.

సంపూర్ణ ఆరోగ్యం కోసం జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

తీసుకోవాల్సిన ఆహారంపై ‘మై ప్లేట్‌ ఫర్‌ ద డే’ జాబితా  అందిస్తోంది. 

ఆన్‌లైన్‌ సమాచారంతో మోసపోకుండా  రోజూ తీసుకోవాల్సిన న్యూట్రిషన్‌ ఫుడ్‌పై అవగాహన కల్పిస్తుంది.

శాస్త్రీయ విధానంలో పోషకాహారంపై అవగాహన కల్పిస్తుంది.   పోషకాల వివరాలు, ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాల వివరాలతో జాబితా సిద్ధం చేసింది.

మై ప్లేట్‌ ఫర్‌ ద డే జాబితా ప్రకారం ధాన్యాలు 240 గ్రాములు, కొవ్వులు 27గ్రాములు, గింజలు 30 గ్రాములు, పప్పులు, మాంసం 90 గ్రాములు, కూరగాయలు, ఆకుకూరలు 350 గ్రాములు తీసుకోవాలి.

పండ్లు 150 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 2వేల కేలరీలతోపాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతోపాటు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు సమృద్ధిగా సరిపోతాయి.

మాంసం తినని వారు ఎక్కువగా పప్పులను తీసుకోవడం వల్ల కండరాల వృద్ధికి అవసరమైన మాంసకృత్తులు అందించిన వారవుతారు.

వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మైక్రో న్యూట్రియంట్ల కొరత కూడా తీరుతుంది అని ఎన్ఐఎన్‌ అంటోంది.