ఆలు బుఖార పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Jyothi Gadda

23 March 2024

ఆలు బుఖారాలో అనేక రకల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది.కేలరీలు తక్కువగా ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచిది. ఎముకల ఆరోగ్యానికి మంచిది.

ఆలు బుఖారా పండ్లలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దీని వలన గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.  గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఆల్ బుఖారా పండ్లలో ఉండే సార్బిటాల్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇసాటిన్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ నివారణగా పనిచేస్తాయి.

ఆల్ బుఖారా పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.  స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ , శ్వాసకోశ సంబంధిత క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.

ఆల్ బుఖారా పండ్లలో ఉండే ఐరన్ రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.  ఆల్ బుఖారా పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

కాలేయంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ఆల్ బుఖారా పండ్లలో ఉండే బోరాన్ ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆల్ బుఖారా పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. కంటి ఆరోగ్యానికి మంచిది. కంటి చూపు సమస్యలను నివారిస్తాయి. షుగర్ నియంత్రణకు మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచిది. చర్మ సౌందర్యానికి మంచిది. ముడతలు తగ్గుతాయి.