పిచ్చి ఆకు అనుకునేరు.. అద్భుత ఔషధం.. 300 వ్యాధులు పరార్
24 October 2024
Ravi Kiran
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్లెవల్స్ను నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మునగాకులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్ ఉన్నాయి.
అలాగే మునగాకులో బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
బాలింతలు, పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. మునగ ఆకులు విటమిన్ C ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
మునగాకులు ఊబకాయం, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. పెరుగు తినడం వల్ల లభించే ప్రొటీన్ల కన్నా.. మునగాకు నుంచి 8 రెట్లు అధికంగా లభిస్తుంది.
పాల నుంచి లభించే క్యాల్షియం కన్నా.. మునగాకు నుంచి 17 రెట్లు అధికంగా లభిస్తుంది.
మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి.
అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా.. ఎండిన మునగాకులో 15 రెట్లు అధికంగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి