మొలకెత్తిన పెసర్లు మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

23 December 2023

అలసటను పోగొట్టేందుకు, హాయిగా నిద్రపోయేందుకు పెసరపప్పు ఎంతగానో సహాయపడుతుంది.  వీటితో పాటుగా మొలకెత్తిన పెసరపప్పును కూడా తినొచ్చు. 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పును తింటే మన  ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ పప్పుల్లో మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. 

మొలకెత్తిన పెసరపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్, విటమిన్-సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పప్పులను తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

మొలకెత్తిన పెసర్లలో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. ఈ పప్పులను తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య పోతుంది

ఫైబర్ కంటెంట్ మెండుగా ఉండే పెసరపప్పు మొలకలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ పప్పును తింటే ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పులు వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పు తింటే మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పప్పు చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. 

మొలకెత్తిన పెసరలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది మన కళ్లకు మేలు చేస్తుంది. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కంటిచూపు పెరుగుతుంది.