మోమోలను ఎక్కువగా తింటున్నారా.? అయితే తస్మాత్ జాగ్రత్త..

17 August 2023

ప్రస్తుత లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఇంటి ఫుడ్‌కు దూరమై.. బయట దొరికే జంక్‌ ఫుడ్‌ను , మోమోలను  లాగించేస్తున్నారు. 

ఈ స్ట్రీట్‌ ఫుడ్‌లో ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన ఫుడ్.. మోమో. ఈ మోమోలను తెగ లాగించేస్తున్నారు జనాలు.

రుచిగా ఉండటమే కారణం. అయితే, ఈ మోమోలను అతిగా తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇప్పుడు చాలా చోట్ల మోమో విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. వీటిని తినేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. 

వర్షాకాలంలో మోమోలు తినడం భలే రుచిగా ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని తినేందుకు ఇష్ట పడుతున్నారు.

వాస్తవానికి మోమోస్ ని ఇడ్లీల మాదిరిగా ఆవిరిపై ఉడికించి తయారు చేస్తారు. దానిని తయారు చేసి పిండితోనే సమస్య ఉందని చెబుతున్నారు నిపుణులు.

ఎందుకంటే ఈ పిండిని రోజూ తినడం సరికాదంటున్నారు. ఇందులో క్లూకోజ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు.

రోజూ మైదాతో తయారు చేసిన మోమోలను తినడం వలన షుగర్ పెరిగి ఆరోగ్యం పడే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు..

దాంతో పాటు బరువు కూడా పెరుగుతారు. మలబద్దకం సమస్య కూడా పెరుగుతుంది. అందుకే మోమోస్ తినొద్దని సలహా ఇస్తున్నారు.