చాలా మంది పుదీనా ఆకులను కేవలం ఒక సువాన ఇచ్చే ఆకుగా మాత్రమే చూస్తారు. కానీ.. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనా వాసన చూస్తేనే మూడ్ అంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుంది.
వంటల్లోనూ మంచి రుచి, వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు. పుదీనా వంటల టేస్ట్ పెంచడానికే కాదు.. మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.
బ్లోటింగ్ సమస్యకు పరిష్కారం పుదీనా ఆకులు.. రోజూ తినడం వల్ల చర్మానికి చాలా చలవ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు పుదీనా ఆకులు ప్రయోజనకరం.
ముఖంపై మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా, నిమ్మరసం కలిపి ముఖానికి రాయటం వల్ల పింపుల్స్ సమస్య తొలగిపోతుంది. చర్మాన్ని అందంగా మారుస్తుంది.
విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. కంటిచూపు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్, ఐరన్, మాంగనీస్ , ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి.
పుదీనా జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
శరీరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దూరం చేసేందుకు పుదీనా ఆకులు మంచి ప్రత్యామ్నాయం. సీజన్ మారినప్పుడు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. నోటి దుర్వాసన సమస్యను పోగొడుతుంది.
జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలకు పరిష్కారం అవుతుంది. రోజూ పుదీనా ఆకులు నమలడం అలవాటు చేసుకుంటే ఈ సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.