ఈ జ్యూస్‌ తాగితో ఎన్ని రోగాలకు చెక్‌ పెట్టొచ్చా తెలుసా..!

TV9 Telugu

18 February  2024

ప్రస్తుత కాలంలో చాలా మంది పోషక ఆహారం కన్నా బయట లభించే , జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 

ముఖ్యంగా బీపీ, షుగ‌ర్, థైరాయిడ్, గ్యాస్, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, గుండె జ‌బ్బులు, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పెరుకుపోవ‌డం, అధిక బ‌రువు, కీళ్ల నొప్పులు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

ఈ అనారోగ్యకరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అనేక ర‌కాల మందుల‌ను వాడుతున్నారు. మందులు వాడినప్పటికి  ఎలాంటి ఫలితం లభించడం లేదు. 

అయితే ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి మందులను వాడాల్సిన అవసరం ఉండదు.  ఈ జ్యూస్‌ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి. 

పుదీనాను, కొత్తిమీరు, పది తులసి, నిమ్మకాయ తీసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ఒక   జార్ లో ఒక గ్లాస్ నీటిని కలుపుకోవాలి. 

ఇప్పుడు ఈ ఆకుల‌ను వీలైనంత మెత్త‌గా జ్యూస్ లాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. జ్యూస్ ను వ‌డక‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌ఇలా త‌యారు చేసుకున్న రోజుకు ఒక గ్లాస్ తాగాలి. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. 

ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల డయాబెటిష్, షుగర్‌, సీజన్ల్‌ వ్యాధులు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు పుదీనాను, కొత్తిమీరతో కలిపి తయారు చేసుకున్న జ్యూస్‌ తీసుకోవడం చాలా మంచిది. 

మీరు జంక్‌ ఫూడ్స్‌ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. అలాగే శరీర సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల  సుల‌భంగాఅనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆరోగ్యనిపుణులు తెలియ‌జేస్తున్నారు.