ఈ పచ్చటి ఆకు కూరతో..ఎలాంటి రోగమైనా ఇట్టే పరార్..!

14 March 2024

Jyothi Gadda

పొన్నగంటి కూర, ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఇది అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర. దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే చాలా రుచికరంగా వుంటుంది. దీనికి విత్తనాలు వుండవు. 

పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. 

ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. పొన్నగంటి కూరలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. 

ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే తినాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం ఒక్కోసారి వికారానికి దారి తీస్తుంది.

పొన్నగంటి కూరను పలురకాలుగా కూరలుగా వాడతారు.  జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధంలో వంటిలోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.

సమాచారం ప్రకారం.. పొన్నగంటి కూర ఆకులు 48 రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది..

ఈ కూర‌ను తినడం వల్ల పైత్యం,  జ్వరం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల చ‌ర్మవ్యాధులు నయమవుతాయి. అంతేకాకుండా  వీర్య క‌ణాల సమస్యతో బాధపడుతున్న వారికి ఔషధంగా పని చేస్తుంది.