బంగాళదుంప పాలతో ఆరోగ్యం పదిలం.. తయారీ ఎలా అంటే..
TV9 Telugu
20 October 2024
బంగాళదుంప పాలను తయారుచేయడానికి కావలసిన ప్రదార్దాలు బంగాళాదుంపలు, దంచిన బాదం పప్పు, ఉప్పు, ఏదైన స్వీటెనర్.
ముందుగా స్వచ్ఛమైన బంగాళదుంపలను తీసుకొని తొక్కతీసి వైటీ వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ బాణా పెట్టుకోవాలి. అందులో ముందుగా సన్నగా తరిగిన బంగాళదుంపలను వేసి మరిగించాలి.
ఇప్పుడు ఆ బంగాళదుంపలను మిక్సర్‌లో వేసి, నీరు, దంచిన బాదం, ఉప్పు, స్వీటెనర్ వేసి బాగా బ్లెండ్ చేయాలి.
ఇప్పుడు బ్లెండ్ చేసిన పేస్ట్ తీసుకొని అందులోని పాలను వడకట్టండి. అంతే మీకు కావాల్సిన బంగాళాదుంప పాలు సిద్ధం.
మీరు బంగాళాదుంప పాల కోసం ఆరోగ్యకరమైన చక్కెరల కోసం చూస్తున్నట్లయితే, దీనికి కూడా ఓ ప్రత్యేక పదార్థం ఉంది.
సహజ చక్కర కోసం మీరు చిలగడదుంపలను ఉపయోగించాలి. బంగాళాదుంప పాలు సాధారణ పాల కంటే కొంచెం ఉప్పగా ఉంటాయి.
ఈ పాలు చాల రుచికరంగా ఉంటాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి