అనారోగ్యం మీ దరిచేరొద్దంటే.. ఇలా చేయండి. 

08 October 2023

నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో టమాటోలు భాగం చేసకోవాలి. ఇందులోని లైకోపీన్, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

టమాటోలు.. 

ఉల్లి కేవలం వంటకు రుచిని మాత్రమే కాదు శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఉల్లిపాయలో విటమిన్‌ సి, విటమిన్ బి6, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఉల్లితో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 ఉల్లి.. 

వెల్లుల్లితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఇందులోని యాంటీ ఫంగల్‌, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ దెబ్బతినకుండా కాపాడుతుంది.

వెల్లుల్లి.. 

ఆరోగ్యానికి అల్లంతో ఎన్నో లాభాలుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లంలోని ఔషధ గుణాలు జలుబు, దగ్గు, వికారం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అల్లం.. 

నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన మరో ఆహారం పచ్చిమిర్చి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, కాల్షియం, జింక్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును పెంచుతుంది. 

పచ్చి మిర్చి.. 

ఆహారంలో నట్స్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్‌, విటమిన్లు బరువును అదుపులో ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

నట్స్‌.. 

ఆరోగ్యంగా ఉండాలంటే గుండు తీసుకోవాలని నిపుణులు చెబుతూనే ఉంటాఉ. గడ్డులో ఉండే విటమిన్‌ 6, విటమిన్‌ బీ12, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి పోషకాలు శరీరాన్ని అనారోగ్యల నుంచి రక్షిస్తాయి. 

గుడ్డు.. 

ఆహారంలో మార్పు చేయడంతో పాటు లైఫ్‌స్టైల్‌లో కూడా మార్పులు చేస్తే నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌తో పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. 

వీటితో పాటు..