ఈ నల్ల జీలకర్రను చేదు జీలకర్ర అని కూడా అంటారు. నల్ల జీలకర్రను ఉపయోగించి ఒక మరణాన్ని తప్ప మిగిలిన అన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద గ్రంథాలలో ఋషులు పేర్కొన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
నల్ల జీలకర్రలో శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. నల్ల జీల కర్రలో ఉండే రసాయనిక పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మనకు వచ్చే కడుపు సంబంధిత సమస్యలను, మూత్రపిండాల సంబంధిత సమస్యలను, కాలేయ సంబంధిత సమస్యలను, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయడంలో నల్ల జీలకర్ర ఔషధంగా పని చేస్తుంది.
శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగించంలో, బీపీని నియంత్రించడంలో, చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా ఈ నల్ల జీలకర్ర దోహదపడుతుంది. శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.
శరీరంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో నల్ల జీలకర్ర ఎంతగానో సహాయపడుతుంది. నల్ల జీలకర్ర యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
నల్ల జీలకర్ర నూనెను రాసుకోవడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ విధంగానే కాకుండా నల్లజీలకర్రను పొడిగా చేసి దానికి తేనెను కలిపి ఉదయం పరగడుపున తీసుకున్నా కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది.
ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రరను వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది.
దగ్గు, జలుబు వంటి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలోనూ ఈ జీలకర్ర మనకు తోడ్పడుతుంది. నల్ల జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు.