ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో బటర్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
20 December 2023
TV9 Telugu
మనం తినే ఆహారంలో కొన్ని విటమిన్‌లు కొవ్వులో కరిగి మనకు ఉపయోగ పడతాయి. విటమిన్ ఏ, డీ, ఈ, కేలను ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్‌లు అంటారు.
బట్టర్‌లో ఉండే కొన్ని రకాల ఫ్యాటీ యాసిడ్లు జీవ క్రియను మెరుగు పరుస్తాయి. దీంతో శరీరం నుంచి మరిన్ని ఎక్కువ క్యాలరీలు ఖర్చు కావటంతో బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
బట్టర్‌లో ఉండే బీటా కెరోటిన్ అనే రసాయనం మనం తిన్న తర్వాత ఏ విటమిన్‌గా మారుతుంది. ఇది కళ్లకు మంచిది. ఊపిరితిత్తుల క్యాన్సర్లను దూరం చేస్తుంది.
వెన్నలో ఎక్కువ మొత్తంలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మపు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.
బట్టర్‌తో విటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఎముకల సాంద్రత తగ్గకుండా ఉండాలన్నా, అవి దృఢంగా మారాలన్నా వెన్నపూస ఉపయోగ పడుతుంది.
వెన్నపూసలో డీ విటమిన్‌తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. అందువల్ల బోలు ఎముకల వ్యాధుల్లాంటివి రావు. తొందరగా ఎముకలు విరగడం లాంటివి జరగవు.
బట్టర్‌తో ఈ విటమిన్ తగినంతగా దొరుకుతుంది. దెబ్బలు, వాపులు వంటివి తొందరగా తగ్గుతాయి. అతి నీలలోహిత కిరణాల వల్ల చర్మం ఎక్కువ దెబ్బ తినకుండా చూస్తుంది.
వెన్న తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి తక్షణమే అందుతుంది. దీనిలోని కొవ్వులు పిల్లల మెదడు పెరుగుదలకు, నరాల బలానికి ఉపయోగపడతాయి. మెదడు శక్తివంతంగా పని చేయడానికి సహాయ పడుతుంది.