చలికాలంలో నారింజ పండ్లు తింటే ఏమవుతుందో తెల్సా

13 December 2024

Ravi Kiran

చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలా మంది ఈ సీజన్‌లో సీజనల్ ఫ్రూట్స్ అయిన నారింజలను తినడానికి వెనుకాడతారు. నారింజ పండ్లను తింటే జలుబు, ఫ్లూ వస్తాయని భయపడుతుంటారు. 

ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నారింజ పండును తప్పనిసరిగా ఈ కాలంలో తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

నారింజ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండులోని పీచు ఆకలిని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఆరెంజ్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగులను బాగా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

ఆరెంజ్‌లో విటమిన్ సి, ఇ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. ముఖంపై ముడతలు తగ్గుతాయి. 

ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. బ్లాక్ హెడ్స్, ముఖంపై ఏర్పడే ఇతర మచ్చలను సైతం తొలగిస్తుంది. 

ఆరెంజ్‌ పండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ తీసుకుంటే హృదయనాళ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది.