స్ట్రాబెర్రీలు తింటే.. గుండె ఆరోగ్యం భేష్
09 December 2024
Ravi Kiran
స్ట్రాబెరీ పండ్లు రుచిగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్ సి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
స్ట్రాబెర్రీలు తింటే ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆక్సిడేటీవ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి.
ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. స్ట్రాబెరీ లో ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది.
ఇది గుండె ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుకు కూడా సహాయపడుతుంది. ఈ బెర్రీ పండును మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
స్ట్రాబెరీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
స్ట్రాబెర్రీలు క్యాన్సర్ కణాలను అడ్డుకునేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడతాయి
స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆర్థరైటిస్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి