కందిపప్పు ఎక్కువగా తింటున్నారా?అయితే, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి..
Jyothi Gadda
కందిపప్పు మన ఆహారంలో సాధారణంగా ఉండే ఒక పప్పు దినుసు. ఇందులో చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
కందిపప్పులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఎ, బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉంచి, అతిగా తినకుండా చేస్తుంది.
డయబెటిస్ ఉన్నవారు కందిపప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి ఎంతో మేలు చేస్తుంది.
పప్పులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, మలబద్ధకం నిరోధించడానికి సహాయపడుతుంది. కందిపప్పును మితంగా తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కందిపప్పులో కొన్ని రకాల చక్కెరలు ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యే సమయంలో వాయువు పుట్టేలా చేస్తాయి. కొంతమంది అధికంగా కందిపప్పు తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
కందిపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, కొంతమందిలో వాయువు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అలెర్జీ ఉన్నవారు ఈ కందిపప్పు తీసుకోవడం వల్ల దురద, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
కందిపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ, గుండెలో మంట వంటి సమస్యలు రావచ్చు. కందిపప్పులో ఫైటిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల, ఐరన్ లోపం రావచ్చు, ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
అందుకే కందిపప్పును మితంగా తినండి. నానబెట్టి వండడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో పాలకూర, బెండకాయ వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, కందిపప్పును తినే ముందు డాక్టర్‌ను సంప్రదించండి.