ఈకలు లేని కోళ్లు.. వీటి గురించి తెలుసా?

15 August 2023

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ఇజ్రాయెల్ శాస్త్రవేత్త అవిగ్డోర్‌ కాహనర్‌ 2002లో ఈకలు లేని కోళ్లను సృష్టించాడు

బ్రాయిలర్‌ కోడికి ప్రత్యామ్నాయంగా ఈకలు లేని కోళ్లను సృష్టించారు. ఐతే ఇంకా ఎందుకు మన మార్కెట్లోకి రాలేదో తెలుసా..

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బ్రాయిలర్‌ కోళ్లు జన్యుపరంగా మార్పు చేయడం వల్ల దాణా ఎక్కువగా తింటాయి 

అందువల్ల వాటి శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. గుండె నిమిషానికి 300 సార్లు కొట్టుకుంటుంది.

బ్రాయిలర్‌ కోళ్లు వేగంగా పెరగడం వల్ల వ్యాపారులు డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నారు. ఐతే ఇవి వేడి వాతావరణంలో బతకడం కష్టం

ఈ సమస్యకు ప్రత్యామ్నాయం ఏంటనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈకలు లేని కోడి. ఐతే వీటిని సృష్టించి 20ఏళ్లు అవుతున్నా మార్కెట్లోకి ఎందుకు రాలేదంటే..

ఇజ్రాయెల్‌ జన్యుశాస్త్రవేత్త మెడ వద్ద ఈకలు లేని కోళ్లను, బ్రాయిలర్‌ కోళ్లను తీసుకొని పూర్తిగా ఈకలులేని కోళ్లను సృష్టించాడు

తక్కువ ఆహారంతో తొందరగా వృద్ధి చెందడం, వేడిని తట్టుకోగలగడం వీటి లక్షణాలు.. ఐతే వాటి అసహజ రూపం ఎవరికీ నచ్చడం లేదు

పైగా దోమకాటు, చర్మవ్యాధులు, వడదెబ్బ, ఉష్ణోగ్రతలో వైవిధ్యాలను ఈ జాతి తట్టుకోలేదని తేలడంతో మార్కెట్లోకి ఇంకా తీసుకురాలేదు