ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం! ఈ సమస్యలన్నీ దూరం..!!
TV9 Telugu
13 January 2024
పీరియడ్స్‌లో ఎండుద్రాక్ష తినడం వల్ల నొప్పి సమస్య తగ్గుతుంది. పీరియడ్స్ సమయంలో నానబెట్టిన ఎండు ద్రాక్షను కుంకుమపువ్వు లేదా బాదంపప్పుతో కలిపి తింటే చాలా మేలు జరుగుతుంది.
మహిళలల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండుద్రాక్షతో శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు దూరమవుతాయి.
ఎండుద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల పటిష్టతకు పని చేస్తాయి. మహిళల్లో వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఎండుద్రాక్షలో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు పని చేస్తాయి. ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల అంటు వ్యాధుల ప్రమాదాన్ని దూరంగా ఉంచుతుంది.
అధిక బరువుతో ఇబ్బందిపడేవారు ఎండుద్రాక్ష తింటే ఊబకాయం నుంచి బయటపడవచ్చు. కేవలం మహిళలకు మాత్రమే కాకుండా పురుషుల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
మధుమేహంతో బాధపడే వారు నిత్యం ఎండుద్రాక్ష తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇంకా గుండె సమస్యలను దూరం చేయడంలో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమర్థవంతంగా పని చేస్తాయి.
ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం అన్నీ రకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా తక్షణ శక్తినివ్వడంలో కూడా ఎండు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎండుద్రాక్షను ప్రతిరోజూ ఆహార డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు క్రమం తప్పకుండా వీటిని తినడం అలవాటు చేసుకుంటే ఎంతో మేలు.