నేటి జీవన శైలి కారణంగా అధిక మంది జంక్ పుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో ఒక్కోసారి కడుపునిండా భోజనం చేసినా జంక్ ఫుడ్స్‌పైకి మనసు లాగుతుంటుంది
టీవీ చూస్తూ చిప్స్, మూవీకెళ్తే ఫ్రెంచ్‌ఫ్రైస్, సండే వస్తే బర్గర్, షాపింగ్‌కు వెళ్తే బర్గర్ ఇలా సందర్భం ఏదైనా జంక్‌ఫుడ్ జంక్షన్‌లో ఈ తరం చిక్కుకుపోయింది
మళ్లీ మళ్లీ తినాలనిపించే జంక్‌ఫుడ్ అలవాటు దీర్ఘకాలంలో వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే ఈ ఆహారపు కోరికల్ని వీలైనంత త్వరలో అదుపులో ఉంచుకోవడానికి ట్రై చేయాలి
జంక్‌ఫుడ్స్ తయారీలో ఉపయోగించే కొవ్వులు జీర్ణశక్తిని మందగించేలా చేస్తాయి. అయితే మనకే తెలియకుండా వీటి రుచికి అడిక్టై పోతాం.. జంక్‌ఫుడ్ అలవాటైతే అందులోంచి బయటపడటం కూడా అంత తేలిక కాదు
హాని కలిగించే ఈ చిరుతిళ్లు మానాలనుకున్నప్పుడు మొదట మీ ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. ఇంట్లోనే బెల్లం ఉండలు, చెగోడీలు లాంటి చిరుతిళ్లు తయారు చేసుకోవాలి
పిల్లలకు భోజనం మొక్కుబడిగా కాకుండా రుచిని ఆస్వాదిస్తూ తినడం అలవాటు చేయాలి. భోజన సమయంలో వారికి ఇష్టమైన ఆహారాలను వండిపెట్టండి. దీంతో వారు కడుపు నిండుగా తింటారు
ఫలితంగా ఇతర ఆహార పదార్థాల పైకి మనసు మళ్లదు. ఆరోగ్యవంతమైన ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలకు చెబుతూ ఉండాలి. అడపాదడపా వారికి ఇష్టమైన వెరైటీ వంటలు బయట తినిపిస్తూ ఉండాలి
పిల్లలు ఇష్టంగా తింటున్న జంక్‌ఫుడ్ ఏంటో గుర్తించి వాటిని ఇంట్లోనే తయారు చేయండి. ఇలా చేస్తే అనవసరమైన కొవ్వు, రసాయనాల ముప్పు నుంచి పిల్లలను కాపాడవచ్చు