ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యం. అదే ఉప్పు తగ్గితే దాని రుచి చెడిపోతుంది. ఉప్పు ఎక్కువైనా ఆహారం రుచిని పాడు చేస్తుంది.
ఉప్పు లేని కూర అస్సలు రుచించదు. మనం వండే ఏ వంటకానికైనా ఉప్పు తగలాల్సిందే.
ఉప్పు లేకపోతే ముట్టుకోవడానికి ఇష్టపడం. ఎంతో ఇష్టంగా కష్టపడి వండిన కూరలో ఉప్పు ఎక్కువైతే దానిని తినలేం.
అలా అని వంటను పక్కన పెట్టలేము. వండిన వంట మొత్తం వేస్త్ అయిపోతుంది. మరి ఏమి చేయ్యాలి. కూరలో ఉప్పు ఎక్కువైతే తగ్గించడం చాలా కష్టం అని మనం అనుకుంటాం. కాని దీనిక ఓ చిట్కా ఉంది.
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు ఉడికించిన ఆలుగడ్డను అందులో కలపండి. అంతే అందులోని ఉప్పు మొత్తం ఆలుకు చేరుతుంది.
కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే..అందులో 2 లేదా 3 చెంచాల పెరుగు కూరలో కలిపితే రుచి మరింత పెరుగుతుంది.
ఉల్లిపాయ, టొమాటో.. రెండూ కలిపి ముద్దగా చేసి ఆ కూరలో వేసి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది.