కరకరలాడే ఉల్లిపువ్వు పకోడీ రుచి చూశారా? ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

21 August 2023

ఉల్లి, క్యాబేజీ, చికెన్‌ పకోడీలు మీరిప్పటి వరకూ లాగించేసి ఉంటారు. ఐతే ఉల్లి పువ్వు పకోడీ ఎప్పుడైనా రుచి చూశారా..? కాదు కాదు.. అసలెప్పుడైనా చూశారా..?

చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాదండోయ్‌.. రుచి కూడా అదిరిపోతుంది. ఇదేదో రెస్టారెంట్‌ వంటకం అనుకుని పెదవి విరిచేరు.. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు

వీధుల్లో దొరికే చిరుతిళ్లు ఎంత నోరూరించినా అక్కడ శుభ్రత పాటించరనేది జగమెరిగిన సత్యం.. అయినా పర్లేదులే అని ఒకవేళ తిన్నా.. కడుపునొప్పి తప్పదు

ఇంట్లోనే 5 నిముషాల్లో చేసుకుని నోటికి రుచిగా, వేడిగా తినగలిగే ఉల్లి పువ్వు పకోడీ ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం..

ముందుగా పెద్దసైజు ఉల్లిగడ్డలను తీసుకుని శుభ్రంగా తొక్కలు తీసి నీళ్లతో కడిగేసుకోవాలి. ఆ తర్వాత వాటిని పువ్వులా చాక్‌తో కట్‌ చేసుకోవాలి

లేదంటే ఇలా ఉల్లి పువ్వు ఆకారంలో కట్‌ చేసే మిషన్‌లు కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఇలా పువ్వులా వొలిచిన తర్వాత నీళ్లలో ఓ అరగంట ఉంచితే రేకులు విచ్చుకుంటాయి

ఆ తర్వాత అలావిచ్చుకున్న ఉల్లిపువ్వును శనగపిండిలో ముంచి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతాయ్‌.. వీటిని సాస్‌లేదా ఏదైనా చట్నీతో తింటే టేస్ట్‌ అదిరిపోద్ది

కొంత మంది వ్యాపారులు వినూత్నంగా ఈ ఉల్లిపువ్వు బజ్జీలు, పకోడీ తయారు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇక జనాలు కూడా వీటిని ఎగబడి తింటుండటంతో వ్యాపారులు కూడా హ్యాపీ..!