నువ్వులు తింటే పీరియడ్స్ సమస్యలు తీరుతాయా..?

TV9 Telugu

12 January 2024

నువ్వులు పోషకాల భాండాగారం. చలికాలంలో నువ్వులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే లడ్డూల నుంచి చక్లీల వరకు అన్నింటిలో నువ్వులను ఉపయోగిస్తారు. 

నువ్వుల్లో ఎక్కువ మొత్తంలో జింక్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రొజెస్టెరాన్ మొత్తాన్ని పెంచుతుంది. నువ్వులలో లిగ్నన్లు అంటే ఫైబర్ అధికంగా ఉండే సమ్మేళనాలు కూడా ఉంటాయి.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి నువ్వులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవును కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే నువ్వుల్లో వేడి చేసే గుణం ఉంటుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నువ్వులు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి.

నువ్వుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. అధిక స్థాయి ఈస్ట్రోజెన్ గర్భాశయం సంకోచాన్ని ప్రేరేపిస్తుంది. 

నువ్వులను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం క్రమబద్దీకరించబడుతుంది. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. 

నువ్వులు రుతుస్రావాన్ని ప్రేరేపిస్తాయి లేదా నియంత్రిస్తాయనే వాదనకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. 

పీరియడ్ సైకిల్ అనేది హార్మోన్ల మార్పుల ద్వారా ప్రభావితమయ్యే ప్రక్రియ. ఇది ఒత్తిడి, పోషణ,  మొత్తం ఆరోగ్యం వల్ల ప్రభావితమవుతుంది.