ఒక కిలో తేనెను తయారీకి ఎన్ని తేనెటీగలు కష్టపడతాయో తెలుసా.. 

31 January 2024

TV9 Telugu

పురాతన కాలం నుండి తేనెను ఉపయోగిస్తున్నారు. తేనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. ఇది పువ్వుల మకరందం నుంచి తేనెటీగలు తేనెను తయారు చేస్తాయి

పువ్వుల మకరందం 

ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు.  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీపి కోసం తేనెను ఉపయోగించడం ప్రారంభించారు.

తేనెతో ప్రయోజనాలు 

అయితే తేనెటీగలు ఒక కిలో తేనెను తయారు చేయడానికి ఎంత కష్టపడాలి.. ఎంత పని చేయాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?  

ఒక కిలో తేనె

పరిశోధన ప్రకారం, 1,100 తేనెటీగలు కలిసి ఒక కిలో తేనెను తయారు చేస్తాయి. ఇవి సుమారు 40 లక్షల పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకుంటాయి. 

40 లక్షల పువ్వులు 

ఒక తేనెటీగ తన జీవిత కాలం మొత్తంలో సగటున ఒక టీస్పూన్ తేనెలో 12వ వంతు మాత్రమే చేయగలదని తెలిస్తే  ఆశ్చర్యపోతారు.

తేనెటీగ జీవితకాలం 

దగ్గు, గొంతు నొప్పి, మలబద్ధకం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు తగ్గడం, గాయాలు, కాలిన గాయాలు వంటి సమస్యల  నివారణకు తేనె చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

వ్యాధుల నుంచి రక్షణ 

మీరు ప్రతిరోజూ ఒకటి నుండి రెండు టీస్పూన్ల తేనెను నేరుగా తినవచ్చు. గోరువెచ్చని నీరు లేదా పాలలో కలుపుకుని కూడా తినవచ్చు.

ఎలా తినాలంటే