కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగుతుంటారు.కొంతమంది ఖాళీ కడుపుతో వేడి నీరు లేదా సాధారణ నీటిని తాగుతారు. ఈ రెండు విధానాలు శరీరంపై సానుకూల ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.
వేడి నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేడినీరు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మన శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
వేడి నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేడినీరు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మన శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
ఉదయన్నే పరగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్లు తొలగిపోతాయి. మూత్రం, మలం రూపంలో ట్యాక్సిన్లు బయటకు పోవడంలో గోరు వెచ్చని నీరు సహాయపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
బహిష్టు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. గోరు వెచ్చని నీటి వల్ల శరీరం తేలికగా ఉంటుంది. మనస్సు కూడా తేలికగా అనిపిస్తుంది.
చల్లటి నీరు తాగటం వల్ల అథ్లెటిక్ ల పనితీరు మెరుగుపడుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. తీవ్రమైన శారీరక వ్యాయామం తర్వాత చల్లటి నీళ్లను తాగడం మంచిది. దీంతో జీవక్రియ రేటు పెరుగుతుంది.
చల్లటి నీటిని తాగడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అతి చల్లని నీటిని తాగడం మంచిది కాదు. చల్లటి నీటిని తాగడం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా చేసిన వారి శరీర ఉష్ణోగ్రత చల్లబడుతుంది. వారి పనితీరు మెరుగుపడుతుంది.
చల్లని నీరు, చల్లని పానీయం రక్తప్రవాహంలో కొవ్వును పటిష్టం చేస్తుంది. పోషకాలను గ్రహించడం కష్టతరం చేస్తుంది. చల్లటి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చల్లటి నీరు తాగితే శరీరంలో అదనపు శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది.