మందారం ఆరోగ్యానికి దివ్య ఔషధం.. ఈ పువ్వుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. 

25 September 2023

మందారం అన్ని కాలాలలో పెరిగే శాశ్వత పుష్పించే మొక్క..క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. పువ్వులు, ఆకులు, కాండం, విత్తనాలు, వేర్ల కోసం పండిస్తారు. 

క్రిమినాశక లక్షణాలు

మందార పువ్వులను ఆహారంగా, సౌందర్య సాధనంగా, ఔషధ మూలికగా కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. మందారకు ఔషధ విలువలు ఉన్నాయి. ఇది ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ప్రస్తావించబడింది.

ఔషధ విలువలు

ఉదయం ఖాళీ కడుపుతో మందార పువ్వును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండడంతో శరీరంలోని బ్యాక్టీరియా నాశనం చేస్తుంది.

బ్యాక్టీరియా నాశనం

కండరాల నొప్పుల నుండి ఉపశమనం పొందుతుంది. రక్తపోటును తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. జ్వరాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది.

రక్తపోటు

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మందార ప్రభావవంతంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె సమస్య

మందారలో ఫ్లేవనాయిడ్లు, ఫైటోకెమికల్స్ ప్రభావం వలన రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.మందార టీ ప్రభావవంతంగా పని చేస్తుంది. 

మందార టీ

అందంలో మందార వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అనేకం. మందార పువ్వులను షాంపూ, హెయిర్ ఆయిల్, ఫేస్ వాష్, సబ్బులో ఉపయోగిస్తారు.

షాంపూ, హెయిర్ ఆయిల్,

మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మూత్ర విసర్జనను పెంచుతుంది. క్యాన్సర్ సంభావ్యతను నియంత్రిస్తుంది.రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు ఉన్నాయి.

మలబద్ధకం