ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. విటమిన్ సి లోపం కావొచ్చు..   

13 November 2023

పోషకాల లోపం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి లోపం ఉంటే ముందుగా శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. 

విటమిన్ సి

ఎప్పుడూ శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే.. వెంటనే విటమిన్ సి స్థాయిని తనిఖీ చేసుకోవాలి. విటమిన్ సీ  ఎనర్జిటిక్ గా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఎప్పుడూ అలసట

చాలా మంది తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడతాయి. ముఖ్యంగా పిల్లలలో ఎక్కువగా ఈ లక్షణం ఉంటుంది.  తరచుగా వైరల్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడితే విటమిన్ సి లోపానికి సంకేతం.

అంటువ్యాధులు

విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. ఇది తగ్గడం ప్రారంభిస్తే శరీరంలోని గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి

నయం కాని గాయాలు 

విటమిన్ డి మాత్రమే కాదు, విటమిన్ సి లోపం వల్ల కూడా మోకాళ్లు లేదా కండరాలలో నొప్పి వస్తుంది. గుర్తించి చికిత్స తీసుకోక పొతే చాలా కాలం పాటు ఈ సమస్యతో ఇబ్బంది పడవచ్చు.  

కీళ్ల నొప్పి

చర్మాన్ని మెరిసేలా చేయడంలో పోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి లోపం వల్ల చర్మం నల్లగా మారడం లేదా స్కిన్ పగలడం ప్రారంభమవుతుంది.

స్కిన్ లో మెరుపు 

నోటి ఆరోగ్యం కూడా విటమిన్ సీ లోపాన్ని ప్రతిబింబిస్తుంది. బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలైతే మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి 

చిగుళ్ళలో రక్తస్రావం