రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలా? నిజం ఏమిటంటే.. 

14 December 2023

తాగునీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ప్రమాణాలు లేవని వైద్యులు చెబుతున్నారు. ఇది వ్యక్తి  జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

ఎనిమిది గ్లాసుల నీరు 

ఎంత దాహం వేస్తున్నదనే విషయంపై నీళ్లు తాగడం ఆధారపడి ఉంటుందని డాక్టర్ అజయ్ కుమార్ వివరిస్తున్నారు. నీరు ఎప్పుడూ బలవంతంగా తాగకూడదనేది సాధారణ నియమం.

ఒక వ్యక్తి ఎంత నీరు త్రాగాలి

మీ మూత్రం సాధారణ రంగులో ఉన్నంత వరకు.. మీ శరీరంలో నీటి కొరత ఉండదని అర్థం. అటువంటి పరిస్థితిలో మీరు సాధారణ మూత్రాన్ని కలిగి ఉంటే ఎక్కువ నీరు త్రాగకూడదు.

మూత్రంతో పరీక్ష

మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటే, శరీరంలో నీటి కొరత ఉందని అర్థం. ఇలా మూత్రం పసుపు రంగులో ఉంటే తప్పనిసరిగా ఎక్కువగా నీరు త్రాగాలి

మూత్రం పసుపు రంగు

ప్రతి వ్యక్తి శరీరంలో నీటి అవసరాలు వేర్వేరుగా ఉంటాయని డాక్టర్ కుమార్ వివరించారు. క్రీడాకారులకు ఎక్కువ నీరు అవసరమవుతుంది, అయితే రోజంతా కూర్చొని పనిచేసే వారికి తక్కువ నీరు అవసరం.

వివిధ అవసరాలు

మీకు దాహం వేయకపోయినా.. రొజూ ఎనిమిది గ్లాసుల నీరు తాగాలనే పారామీటర్‌కు అనుగుణంగా నీరు తాగుతూ ఉంటే అప్పుడు మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అధిక నీరు హానికరం

ఉదయం ఎక్కువ నీరు త్రాగవచ్చు. ఈ సమయంలో గోరువెచ్చని నీరుని తగడడం అత్యుత్తమం. గోరువెచ్చని నీరు కడుపుని శుభ్రపరుస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది

ఉదయం నీరు త్రాగాలి