ఈ వ్యక్తులు పొరపాటున కూడా పాలకూర తినవద్దు

09 October 2023

ఆకుపచ్చ కూరగాయల్లో ఒకటి పాలకూర. దీనిలో ఐరెన్‌తో సహా అనేక విటమిన్లు ఉంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. అయితే కొంత మంది దీనికి దూరం ఉండాలి.

పాలకూరలో పోషకాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం అధికంగా శరీరంలో పేరుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

పాలకూర ఎందుకు హానికరం

కాల్షియం ఎక్కువగా ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పాలకూరలో ఈ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కనుక కిడ్నీలో రాళ్లు ఉన్నవారు దీనిని తినకూడదు.

కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులు

పిత్తాశయంలో రాళ్లు ఉండటం కూడా సాధారణమే.  అయితే ఆపరేషన్ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లను  తొలగించుకున్న వారు కూడా పాలకూరను తీసుకోరాదు.

పిత్తాశయం రాళ్ళు

ఎవరైనా కడుపు ఉబ్బరం, జీర్ణ శక్తి తక్కువగా ఉండి బాధపడుతుంటే పాలకూరతో చేసిన వాటిని తినవద్దు.  దీంతో సమస్యలు మరింత పెరుగుతాయి.

కడుపు సంబంధిత సమస్యలు

పాల కూర ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య మరింత పెరుగుతుందని నమ్ముతారు.

మలబద్ధకం ఉన్నవారు

ఒక వేళ కీళ్ల నొప్పులు, వాపులు, మంటలతో బాధపడుతున్నట్లయితే అధికంగా తీసుకోకపోవడం మంచిది.

ఆర్థరైటిస్‌ ఉన్నవారు