21 October 2023
పిస్తా అనేది డ్రై ఫ్రూట్ లో ఒకటి. డ్రై ఫ్రూట్స్ లో 'పిస్తా' పప్పుకు ఉన్న ప్రత్యేకతే వేరు.
ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు,ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి.
పిస్తాను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన కంటి సమస్యలు తగ్గుతాయి. చూపు మెరుగుపడుతుంది.
పిస్తా పప్పులోని విటమిన్ 'ఇ' చర్మం మీది మృతకణాలను తొలగించి.. మృదువుగా ఉంచుతుంది
పిస్తా పప్పును తీసుకోవడం వల్ల శరీర భాగాలకూ రక్తం సక్రమంగా ప్రసారం అయ్యేలా చేస్తుంది. రక్తపోటు సమస్య రాదు
పిస్తాలో ఉండే పీచుపదార్ధం జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. శరీరంలోని చెడు కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది.
మధుమేహ వాధి ఉన్నవారికి పిస్తా వల్ల చాలా మేలు. ఇన్సులిన్ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది
బాదం పప్పు కన్నా అధికంగా పోషక పదార్థాలు పిస్తా పప్పులో ఉన్నాయి. ఇందులో పొటాషియం, బి6 విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి
బాదం పప్పు కన్నా అధికంగా పోషక పదార్థాలు పిస్తా పప్పులో ఉన్నాయి.