12 August 2023

భోజనం తరువాత స్వీట్లు లేదా ఐస్ క్రీమ్లు తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..

చాలా మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్లు లేదా ఐస్ క్రీమ్లు తినే అలవాటు ఉంటుంది.

ముఖ్యంగా మనం ఏదైనా ఫంక్షన్లకు వెళితే అక్కడ భోజనంతో పాటు ఇవి తప్పకుండా ఉంటాయి.

అయితే, భోజనం చేసిన తర్వాత వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.

భోజనం తర్వాత వీటిని తింటే వచ్చే సమస్యలేంటో చూద్దాం.

ఆకలి వేయడం వల్ల పొట్టలో గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది.

భోజనానికి ముందు స్వీట్స్‌ తినడం వల్ల పొట్టలోని గ్యాస్‌ తగ్గిపోతుంది.

భోజనానికి ముందు ఐస్క్రీం తింటే ఆకలి తగ్గిపోతుంది.

పొట్టలోని ఆహారం జీర్ణం కావడానికి జఠరాగ్ని అనేది సహాయం చేస్తుంది.

అయితే, భోజనం తర్వాత తీసుకునే చల్లని పదార్ధాలు జఠరాగ్ని పనితీరును దెబ్బతీస్తాయి.

దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఐస్క్రీం అనేది శరీరానికి విరుద్ద ఆహారం.

ఇంకా అధికంగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.