గులాబీ టీ తో ఆరోగ్యం , అందం మన చేతుల్లోనే..
12 August 2023
అందం కోసం తయారు చేసే బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా వాటిలో గులాబీ పూలను వాడుతారు. ఆరోగ్యంలో గులాబీ టీ ప్రముకం
అయితే గులాబీలు అందం కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతాయి. ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగపడుతుంది అంటే..
గులాబీతో చేసిన టీ తాగితే ఆరోగ్యానికి , ముఖ్యంగా కళ్ళకు మంచిదని డాక్టర్లు మరియు నిపుణుల సైతం చెబుతున్నారు.
ఎందుకంటే గులాబీలో విటమిన్ ఏ, సీ, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. ఫ్రీరాడికల్స్ను దూరం చేసి ఆరోగ్యం స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతాయి.
ప్రతిరోజు రోజ్ టీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఒత్తిడి, ఆందోళన మరియు తలనొప్పి నుంచి విముక్తి పొందవచ్చు.
హార్మోన్ల సమతుల్యత సాధ్యమవుతుంది. ఇంకా నిద్రలేమి సమస్యలను తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడం,
మలబద్దకాన్ని దూరం చేయడంలోనూ రోజ్ టీ ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్-సి అధికంగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి