పనీర్‌తో ఇన్ని లాభాలున్నాయా.?
03 October 2023
పనీర్‌తో కర్రీతో పాటు మరెన్నో వంటకాలు చేసుకోవచ్చు. పనీర్ 65, పనీర్ బటర్ మసాలా, పనీర్ టిక్కా వంటివెన్నో తయారు చేసుకోవచ్చు.
పనీర్‌లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులోని కాల్షియం, విటమిన్ డి, విటమిన్ ఇ, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పనీర్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. పనీర్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే గుల్లబారిన ఎముకలు గట్టిపడతాయి.
మహిళలకు పనీర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. పనీర్ తీసుకుంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు. అలసటను సైతం దూరం చేస్తుంది.
ఇక పనీర్‌లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ కడుపులోని బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే గర్భిణీల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
గుండె సమస్యలకు కూడా పనీర్‌తో చెక్ పెట్టొచ్చు. ఇందులోని లిపిడ్లు, పొటాషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేస్తాయి. గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
పనీర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అంతేకాకుండా నిత్యం పనీర్ తీసుకోవడం వల్ల బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
పనీర్‌లోని విటమిన్ ఇ, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా ఇందులోని కాపర్ వల్ల జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..